![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవిలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -99 లో.. కృష్ణ కాలేజీ కి రెడీ అయి సర్ నేను కాలేజీకి వెళ్తున్నా అని మురారికి చెప్పగానే.. నేను డ్రాప్ చేస్తానని మురారి అంటాడు. "లేదు సర్ నేను వెళ్ళగలను. మీరు ఇచ్చిన ధైర్యంతో వెళ్ళిరాగలను సర్" అని కృష్ణ చెప్పేసి వెళ్ళిపోతుంది. "ఏంటి మురారి నన్ను మర్చిపోయాడా? కృష్ణకి సపోర్ట్ చేస్తున్నాడు.. నేను ఇప్పటికి ఎప్పటికి నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నా ప్రేమ నీకు మాత్రమే.. ఆదర్శ్ వచ్చినా కూడా నీ మీదనే ప్రేమ పెంచుకుంటాను. ఇంతకు మురారి మనసులో నా స్థానం ఏంటో తెలుసుకోవాలి" అని ముకుంద అనుకుంటుంది.
మరోవైపు కాలేజీకి వెళ్ళిన కృష్ణ హడావిడిలో గౌతమ్ కి డాష్ ఇస్తుందనగా గౌతమ్ తప్పుకుంటాడు. "ఎందుకు ఇంత హడావిడి? ఇప్పుడు టైం ఎంత అయిందో చూసుకున్నావా" అని కృష్ణని అడుగుతాడు గౌతమ్. కృష్ణ తింగరి సమాధానం చెపుతుంది. ఆ తర్వాత సర్లే అని ఆ విషయాన్ని వదిలేస్తాడు. "నాకు తలనొప్పి గా ఉంది టీ తాగి వద్దాం పదా" అని గౌతమ్ అనగానే.. సరే అని కృష్ణ అంటుంది. ఇద్దరు కలిసి కాఫీ తాగడానికి బయటికెళ్తారు. మరోవైపు స్టేషన్ కి రెడీ అయి మురారి వెళ్తుంటే ముకుంద మురారిని ఆపి.. నీతో మాట్లాడాలని అంటుంది. తను అలా అనగానే మురారి అక్కడ ఎవరైనా ఉన్నారా అని చుట్టుపక్కల చూస్తూ భయపడుతుంటాడు. "అసలు నన్ను నువ్వు చులకనగా చూస్తున్నావ్ కదా? కృష్ణ మీద ప్రేమా? అభిమానమా?" అని ముకుంద అడుగగా.. "నీ మీద మాత్రం ప్రేమ ఎన్నటికి పుట్టదు.. మన ప్రేమ గతం. అన్ని మర్చిపో" అని మురారి అంటాడు. నువ్వు పెళ్ళి అయ్యాక మారిపోయావని ముకుంద ప్రశ్నిస్తుంది. పెళ్ళి అయ్యాక ఏ మగాడైనా మారాల్సిందే అని మురారి సమాధానమిస్తాడు. నన్ను క్షమించు ముకుంద అని మురారి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
మరోవైపు టీ తాగడానికి వెళ్ళిన కృష్ణ గౌతమ్ ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ గౌతమ్ కి నందు రిపోర్ట్ లు, టాబ్లెట్లు చూపిస్తుంది కృష్ణ. అవి చూసిన గౌతమ్ "ఇవన్నీ గతం గుర్తురాకుండా ఉండే టాబ్లెట్స్. అవి వాడొద్దని చెప్తాడు. నేను టాబ్లెట్స్ రాసిస్తాను ఇవే వాడండి" అని చెప్తాడు. ఇక కృష్ణ ఉండేది ఎక్కడ అని గౌతమ్ అడిగేసరికి.. కృష్ణ తన అడ్రస్ చెప్తుంది. అలా కృష్ణ చెప్పడంతో.. గౌతమ్ తను ప్రేమించిన అమ్మాయి అడ్రస్ కూడా అదే కదా అని మనసులో అనుకుంటాడు. ఏంటి సర్ ఏదో ఆలోచిస్తున్నారని కృష్ణ అడుగగానే.. ఏం లేదని చెప్పి గౌతమ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |